A-AA+ English
లాగిన్

భూధార్ గురించి

జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.

ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం 28 రాష్ట్రం యొక్క సెన్సస్ కోడ్. భూధార్ సంఖ్య రాష్ట్ర కోడ్ 28 తో మొదలవుతుంది, దీని తరువాత 9 అంకెలు 'యాదృచ్ఛిక’ సంఖ్యను అనుసరిస్తుంది.

భూవిభాగపు ప్రాధమిక వివరములు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 99 సంఖ్యతో మొదలయ్యే తాత్కాలిక భూధార్ కేటాయించబడుతుంది.

భూవిభాగపు ప్రాధమిక వివరములు, భౌగోళిక అక్ష్యాంశాలు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 28 సంఖ్యతో మొదలయ్యే శాశ్వత భూధార్ కేటాయించబడుతుంది

  • తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.xxx.xxx.xxx
  • శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.xxx.xxx.xxx
  • ప్రభుత్వ ఆస్తులకు అందించే తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.00x.xxx.xxx
  • ప్రభుత్వ ఆస్తులకు అందించే శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.00x.xxx.xxx

భూ విభాగము / ఆస్తి పై జరిగే ప్రతి లావాదేవీ తో భూధార్ సంఖ్య మార్చబడుతుంది మరియు ఆ భూ విభాగమునకు / ఆస్తికి ఇంతకు ముందు అందించిన భూధార్ సంఖ్య నిరుపయోగమవుతుంది